భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు

హైదరాబాద్‌: పెట్రోల్‌ లీటరు ధర రూ.84.54, డీజిల్‌ లీటరు ధర రూ.80.33గా ఉంది.

0
22
fuel prices

ఇటీవల చుక్కలు చూపించిన ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా 12వ రోజు కూడా పెట్రో ధరలు తగ్గాయి. ఇటీవల ఆల్‌ టైం గరిష్టాలను తాకిన ఇంధన ధరలు అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో తాజాగా ఆరువారాల కనిష్ఠానికి దిగి వచ్చాయి. ఈ నెల 18 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో దేశంలో ఇంధన సంస్థలు కూడా ఆ మేరకు ధరలను తగ్గించాయి.

సోమవారం ఢిల్లీలో లీటరుకు పెట్రోలు ధర 30 పైసలు తగ్గిన 79.75గా ఉంది. డీజిల్ ధర లీటరుకు 20 నుంచి తగ్గి రూ. 73.85గా ఉంది. ముంబైలో పెట్రోలు లీటరుకు 85.24 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు 77.40 రూపాయలుగా ఉంది. పెట్రోల్‌పై 30పైసలు, డీజిల్‌పై 21 చొప్పున ధర తగ్గింది.

విజయవాడ: పెట్రోలు ధర రూ.83.65, డీజిల్‌ లీటరు ధర రూ. 79.08 పలుకుతోంది.
కోలకతా: పెట్రోలు లీటరు ధర రూ.81.63, డీజిల్ లీటరు ధర రూ .75.70
చెన్నై: పెట్రోలు లీటరు ధర రూ. 82.86, డీజిల్‌ లీటరు ధర రూ. 78.08