గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి

0
113
mvvs murthy dies in road accident

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ విద్యావేత్త, గీతం వర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అమెరికాలోని అలస్కాలోని ఆంకరేజ్‌ సిటీ వద్ద మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న శ్రీ వెలువోలు బసవపున్నయ్య , శ్రీ వీరమాచినేని శివ ప్రసాద్, శ్రీ వి. బి ఆర్ చౌదరి (చిన్న) మృతి చెందినట్టు సమాచారం. వీరితో పాటు ఇదే కారులో ప్రయాణిస్తున్న కడియాల వెంకటరత్నం (గాంధీ) తీవ్ర గాయాలతో అలాస్కా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆంకరేజ్‌ సిటీ వద్ద గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.