తగ్గిన బంగారం ధర

gold rate

బంగారం ధర మరోసారి భారీగా పడిపోయింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వెళ్లిన పసిడి ధర శుక్రవారం పతనమైంది. నేటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250 తగ్గి రూ.31,850కు చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు, స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడం బంగారం ధర పతనానికి కారణమైంది. మరోపక్క వెండి కూడా రూ.100 తగ్గి కిలో రూ.39,250కు చేరింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వెండి ధర తగ్గుదలకు కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి.

అంతర్జాతీయంగా బంగారం ధర 0.16శాతం తగ్గి ఔన్సు 1,199.40డాలర్లు పలికింది. వెండి కూడా 0.03 శాతం తగ్గి ఔన్సు 14.64 డాలర్లకు చేరింది. న్యూదిల్లీలో 99.9శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.250తగ్గి రూ.31,850కు చేరగా, 99.5 నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.31,700గా ఉంది. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.625 పెరిగిన సంగతి తెలిసిందే.తగ్గిన బంగారం ధర