గూగుల్ తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌

ఎయిర్‌టెల్‌ సమస్యలకు గూగుల్‌ పరిష్కారం!

0
143
google assistant to answer queries of airtel users

మీరు ఎయిర్‌టెల్‌ కస్టమర్లా? అయితే ఇది మీకోసమే. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఇక నుంచి ప్రతి చిన్న విషయానికీ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాల్సిన పనిలేదు. ఎయిర్‌టెల్‌కు సంబంధించి మీకు ఎదురయ్యే సమస్యలకు గూగుల్‌ అసిస్టెంట్‌ పరిష్కారం చూపిస్తుంది.

‘‘టెలికాం రంగంలో మరో ముందడుగు. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌తో ఎయిర్‌టెల్‌ చేతులు కలిపింది. ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలను కృత్రిమమేధ సాయంతో గూగుల్‌ అసిస్టెంట్‌ పరిష్కారం చూపగలదు’’ అని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్‌తో ఎయిర్‌టెల్‌ వినియోగదారులు మరిన్ని మెరుగైన సేవలను పొందగలరని వెల్లడించింది. ప్రస్తుతం ఇంగ్లీష్‌ భాషలోనే సేవలందించనుండగా, త్వరలోనే లక్షలాది భారతీయులకు వారి ప్రాంతీయ భాషల్లోనే సమస్యకు పరిష్కారం లభించేలా చేస్తామని పేర్కొంది.

‘వినియోగదారులు తరచూ అడిగే ప్రశ్నలకు గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా పరిష్కారం లభిస్తుంది. దీన్ని మరింత అభివృద్ధి చేయటం ద్వారా ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తాం’ అని భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టర్‌ సారంగ్‌ కన్నాడే తెలిపారు.