Androidలో ఫోన్ నంబర్ లేకుండా Google డుయోలో కాల్ చేయొచ్చు... ఎలానంటే?

Androidలో ఫోన్ నంబర్ లేకుండా Google డుయోలో కాల్ చేయొచ్చు... ఎలానంటే?

 

మీ ఫోన్ నెంబర్ లింక్ చేయాల్సిన అవసరం లేకుండానే వెబ్ క్లయింట్‌లో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ డుయో కాల్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫోన్ నంబర్ లేకుండా యూజర్లను కాల్ చేయడానికి అనుమతించే దిశగా గూగుల్ పనిచేస్తోంది. ప్రఖ్యాత బ్లాగర్, హ్యాకర్ జేన్ మంచున్ వాంగ్ చెప్పినట్టుగా ఆండ్రాయిడ్ కోసం ఈ ఫీచర్‌ను డుయో యాప్‌కు కంపెనీ ఇంకా ప్రవేశపెట్టలేదు. కొత్త సెట్టింగ్ మీ ఫోన్ నంబర్‌ను కాకుండా మీ ఈ-మెయిల్ అడ్రస్‌ను ఉపయోగించి యాప్‌లో మిమ్మల్ని సంప్రదించడానికి ఇతరులకు అనుమతిస్తుంది.

జనవరిలో వెబ్ క్లయింట్ కోసం రూపొందించిన క్రొత్త సర్వీసు.. మీ టెలిఫోన్ నంబర్‌ను వారి అకౌంట్‌కు లింక్ చేయకుండా కాల్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది. గూగుల్ డుయో ఒక గ్రూపు వీడియో కాల్‌కు వ్యక్తుల సంఖ్యను పెంచే సామర్థ్యాన్ని రూపొదించింది. లాక్ డౌన్ మధ్య ఇంటి నుండి పని చేసేవారికి అనుకూలంగా డెవలప్ చేసింది. డుయో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టడ్ వీడియో కాలింగ్ ప్లాట్‌ఫాం, ఆడియో అంతరాయాలను తగ్గించడానికి AI టెక్నాలజీని ఉపయోగిస్తుంది. టెక్ దిగ్గజం ప్రకారం.. గత కొన్ని వారాలలో, డుయో యూజర్లు 180 శాతం ఎక్కువ మెసేజ్‌లను పంపుతున్నారు. చాలా ప్రాంతాలలో 800 శాతం పెరుగుదల ముఖ్యంగా సామాజిక దూరం ద్వారానే ప్రభావితమైనదిగా చెప్పవచ్చు.  

"గ్రూప్ కాలింగ్ పెరుగుతోంది. గత నాలుగు వారాల్లో, డుయోలో గ్రూప్ కాల్స్ సంఖ్యను 8 రెట్లు పెరిగింది. Android, iOSలలో, ఇటీవల గ్రూపు సైజు 12 మంది పాల్గొనేవారికి (8కు బదులుగా) పెంచింది. రాబోయే వారాల్లో పాల్గొనేవారిని మరింత పెంచాలని యోచిస్తున్నాము’ అని గూగుల్ డుయో గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ డేవ్ సిట్రాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి వారం, 10 మిలియన్లకు పైగా కొత్త వ్యక్తులు గూగుల్ డుయో కోసం Sign up చేస్తున్నారని, చాలా దేశాలలో, కాల్ నిమిషాలు 10 రెట్లు ఎక్కువ పెరిగాయని కంపెనీ తెలిపింది. కోర్ కార్యాచరణ పరంగా.. కాల్ చేసేటప్పుడు మాన్యువల్ స్క్రీన్‌షాట్‌లను రిప్లేస్ చేసే డుయో స్నాప్‌షాట్ ఫీచర్ కూడా యాడ్ చేసింది. కింది-ఎడమ వైపుభాగంలో ఉన్న కొత్త షట్టర్ బటన్ రెండు స్ట్రీమ్‌ల ఫోటోను తీస్తుంది. పాల్గొనేవారితో ఆటోమాటిక్‌గా ఫుడ్ సైడ్ బై సైడ్ ఫొటోను  షేర్ చేస్తుంది.