గూగుల్ ఎర్త్ 1000 వాల్ పేప‌ర్స్‌ రిలీజ్‌.. డౌన్ లోడ్ ఫ్రీ

గూగుల్ ఎర్త్ 1000 వాల్ పేప‌ర్స్‌ రిలీజ్‌.. డౌన్ లోడ్ ఫ్రీ

కొన్ని ఏళ్లుగా గూగుల్ ఇప్పటికే కొన్ని వందల అందమైన వాల్ పేప‌ర్స్‌ ఎర్త్ వ్యూ కలెక్షన్ ద్వారా మనకు అందుబాటులో పెట్టింది. ఈ ఫోటోలు అందమైన దృశ్యాలను, మన భూమి ప్రకృతి దృశ్యాలను ఇంకా సముద్రాలను సాటిలైట్ ద్వారా చిత్రీకరించిన‌వి. ఈరోజు గూగుల్ ఇంకో 1000 ఫోటోలను గాలరీ లోకి ఆడ్ చేయగా మొత్తం 2500 ఫోటోలు అయినట్టుగా తెలిసింది. ఫోటోలను ఆడ్ చేస్తూ గూగుల్ ఈ ఎర్త్ వ్యూ ఫోటోలను ఈ కొత్త తరం స్క్రీన్ లకి తగ్గటుగా విడుదల చేశాం అని తెలిపింది. బ్రైట్ కలర్స్ తో షార్ప్ ఇమేజ్ కలిగి ఉన్న 4k రిజల్యూషన్ గల ఇమేజెస్ ను గూగుల్ విడుదల చేసినట్టుగా తెలిపింది. గూగుల్ ఎర్త్ 1000 వాల్ పేప‌ర్స్‌ రిలీజ్‌.. డౌన్ లోడ్ ఫ్రీ

ఇక చెప్పనవసరం లేదు ప్రతి ఒక ఫ్రేమ్ కళ్ళకి కనువిందుగా ఉండటంతో అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ చిత్రాలను చూస్తున్న కొద్దీ ఒక చిత్రం వెయ్యి పదాలు మాట్లాడుతుంది అనేది నిజమే అనిపిస్తుంది . మీరు కూడా ఇప్పుడే వెళ్లి మీ కళ్ళతో మీరే చూడండి. మీకు ఈ చిత్రాలు కావాలంటే గూగుల్ ఎర్త్ వ్యూ గ్యాలరీ కి వెళ్లి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ఎర్త్ వ్యూ క్రోమ్ ఎక్స్టెన్షన్ నీ ఇన్ స్టాల్‌ చేసుకోండి, అప్పుడు మీరు ప్రతి సారి కొత్త టాబ్ ఓపెన్ చేసినపుడు ఒక కొత్త చిత్రంని చూడొచ్చు. మీకు కావాలంటే మీకు నచ్చిన కలర్ ప్రకారం చిత్రాలని మీరు చేంజ్ చేసుకోవ‌చ్చు. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి త్వరగ చూసేయండి.