వీడియో కాల్ లో నిశ్చితార్థం చేసుకున్న గుజరాత్ ఫ్యామిలీ.. వాట్సాప్ లో వైరల్ అవుతున్న వీడియో

వీడియో కాల్ లో నిశ్చితార్థం చేసుకున్న గుజరాత్ ఫ్యామిలీ.. వాట్సాప్ లో వైరల్ అవుతున్న వీడియో

ఒక వీడియో లో గుజరాత్ లోని ఒక ఫ్యామిలీ నిశ్చితార్థం కి తగ్గ ఆచారాలు అన్ని వీడియో కాల్ లోనే కానిచ్చేసింది. ఆ నిశ్చితార్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయిపోయింది. ఆ వీడియో ని చూసిన చాలా మంది తమకు "మెట్రో పార్క్" అనే హిందీ మూవీ గుర్తొచ్చిందంటూ సోషల్ మీడియా లో కామెంట్లు రాసారు. 

మెట్రో పార్క్ మూవీ ఏ ఎందుకు అంటే ఆ ఫిల్మ్ లో పిల్ల‌ల అమ్మానాన్న‌లు గుజరాత్ నుంచి న్యూ జెర్సీ కి వచ్చి అక్కడే 25 ఏళ్లుగా ఉంటారు. వాళ్ళు తమ పిల్లలకి మన సంప్రదాయాలు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకేనేమో ఈ వింత నిశ్చితార్థం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ నిశ్చితార్థాన్ని మనం ఈ వీడియో లో చూడొచ్చు.. ఒక గుజరాతీ ఫ్యామిలీ నిశ్చితార్థానికి తగిన కొన్ని ఆచారాలను ఈ వీడియో కాల్ లో చేస్తున్నారు. అటు వైపు ఉన్నఒక‌ చెక్క బ‌ల్ల పైన అబ్బాయి ఒక ఫోన్ లో ఇటు వైపు చెక్క బ‌ల్ల పై అమ్మాయి ఇంకో ఫోన్ లో వీడియో కాల్ ద్వారా ఆచారాలు పాటిస్తూ చుట్టుపక్కల అందరూ సంతోషంతో చూస్తూ కనిపిస్తున్నారు. ఇంకా ఒక ఆవిడ అమ్మాయి మొబైల్ పైన కుంకుమ పెడుతూ కూడా కనిపిస్తారు. వెండి బంగారు ఆభరణాలతో పాటు వస్త్రాలు కూడా చక్కగా అలంకరించి అమ్మాయి అబ్బాయి ల మొబైల్ ఫోన్ ల ముందు పెట్టింది కనిపిస్తూ ఉంది. 

ఇది చూసిన ఇంకొందరు రాను రాను అలాగే పెళ్ళిలు కూడా జరుపుకుంటారేమో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక జరుపుకున్న జరుపుకోవచ్చు మ‌రి. ఇలాంటి వింత నిశ్చితార్థం ఇదే మొదటి సారి చూడటం అని ఇంకొందరు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై వారి వారి అభిప్రాయాలు తెలిపారు.