హాయ్‌ల్యాండ్‌ వెంకటేశ్వరరావు అరెస్ట్‌

0
17
haailand venkateswara rao

హాయ్‌ల్యాండ్‌ ఎండీ అల్లురి వెంకటేశ్వరరావును సీఐడీ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ వెంకట రామరావుతో కలిసి హాయల్యాండ్‌పై కుట్ర చేశాడనే అభియోగంపై అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావు గతంలో అగ్రిగోల్డ్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేశారు. వెంకటేశ్వరరావు అరెస్ట్‌తో అగ్రిగోల్డ్‌ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. గురువారం వెంకటేశ్వరరావును అధికారులు సీఐడీ కోర్టులో హాజరుపర్చనున్నారు.