ఆరోగ్యసేతును హ్యాకర్లు టచ్ చేయలేరు

ఆరోగ్యసేతును హ్యాకర్లు టచ్ చేయలేరు

 

వినియోగదారుల సమాచారానికి అత్యంత భద్రత కల్పించే విధంగానే కరోనా  ట్రేసింగ్ యాప్ ఆరోగ్య సేతును రూపొందించినట్టు మైగవ్ సీఈవో అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి వివరాలు అత్యంత భద్రంగా ఉంటాయన్నారు. ఎందుకంటే ఈ యాప్ నేరుగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)లోని భారత ప్రభుత్వ సర్వర్‌తో అనుసంధానమై ఉంటుందని సింగ్ పేర్కొన్నారు. 

ఆరోగ్య సేతు యాప్‌లో భద్రతా లోపాలు ఉన్నాయంటూ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ ఎల్లియట్ అల్డెర్సన్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఎక్కడో విదేశాల్లో కూర్చుని మా సిస్టమ్‌లోకి చొరబడ్డానంటూ గుర్తుతెలియని ఓ హ్యాకర్ చెబుతున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు  ఆరోగ్యసేతును రూపొందించామని కరోనా వైరస్‌ బారిన పడకుండా ఇది ముందుగానే అప్రమత్తం చేస్తుందని అభిషేక్ పేర్కొన్నారు.