సినిమాని ఆపేద్దాం రాజు గారూ !!

సినిమాని ఆపేద్దాం రాజు గారూ !!

ఎంతోమంది అగ్ర హీరోలకి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన కమర్షియల్ దర్శకుడు వి.వి వినాయక్.. తాను హీరోగా మారి సీనయ్య అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అది కూడా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత బ్యానర్లో వస్తుంది. నరసింహ అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చి వెంటనే సెట్స్ పైకి వెళ్లారు.

 ఐతే ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత ర‌ష్ చూసి అప్పుడు దిల్ రాజు అసంతృప్తి చెంది మార్పులు చెప్పాడు. 
మార్పులతో మరో షెడ్యూల్ చేశారు అయినా లాభం లేదనిపిస్తుంది. పైగా కథ కూడా ఈ మధ్య రిలీజ్ అయిన కార్తీ సినిమా ఖైదీ సినిమా ఛాయలు బాగా కనిపిస్తున్నాయట. కూతురు సెంటిమెంట్ తో నడిచే తండ్రి పాత్రలో వి.వి వినాయక్ చేస్తున్నాడట. కానీ వినాయక్ కి ఎందుకో ఈ కథతో వెళ్తే విమర్శలు వస్తాయని, ఆపేస్తే బెటరని దిల్ రాజు ని రిక్వెస్ట్ చేస్తున్నాడట. అందులో భాగంగా ప్రస్తుతం ఆ డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది. చూడాలి సీనయ్య ఏం చేస్తాడో.