లాక్‌డౌన్ త‌రువాత‌... హెయిర్ స్టైలిస్ట్ కి షాక్‌

లాక్‌డౌన్ త‌రువాత‌... హెయిర్ స్టైలిస్ట్ కి షాక్‌

 

క‌రోనా వైర‌స్ వ‌చ్చాక ప్ర‌పంచంలోని చాలా వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుండి ప్ర‌జ‌ల జీవితంలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి. ప్ర‌జ‌లు ఆర్ధికంగా, మాన‌సికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ టైంలోనే చాలా మంది వారి మంచి మ‌న‌సుల‌ను చాటుకుంటున్నారు. ఆ కోవ‌కు చెందిన ఓ సంఘ‌ట‌న ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. 

ఇప్పుడు ప్రతి దేశంలోనూ లాక్‌డౌన్‌లో కొంతమేర‌కు సడలింపులు ఇచ్చారు. ఈ కారణంగా సెలూన్లు తెరుచుకున్నాయి. హెయిర్ స్ట‌యిలిస్ట్‌ ఇలిసియా నోవోట్నీ తన దుకాణానికి వ‌చ్చే వినియోగదారుల ఎదురుచూస్తోంది. ఇంత‌లో ఒక కస్టమర్ ఆమె సెలూన్‌కి వచ్చి హెయిర్‌క‌ట్ చేయించుకున్నాడు. త‌రువాత ఆమెకు రెండున్నర వేల డాలర్లు ఇచ్చి వెళ్లిపోయాడు. 

కాగా నోవోట్నీ చాలా రోజులుగా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోంది. సెలూన్ ప్రారంభించిన వెంట‌నే ఇంత‌ పెద్ద మొత్తంలో సొమ్ము ల‌భించ‌డంతో ఆమె ఆనందం వ్య‌క్తం చేస్తోంది.  ఇంతేకాకుండా ఆమె ద‌గ్గ‌ర క‌టింగ్ చేయించుకున్న వ్య‌క్తి ఆమె మేనేజర్‌కు వెయ్యి డాలర్లు, రిసెప్షనిస్ట్‌కు 500 డాల‌ర్లు ఇచ్చాడు. 

ఈ సంద‌ర్భంగా ఆ మహిళా హెయిర్‌స్టైలిస్ట్ అత‌నికి కృతజ్ఞతలు చెబుతూ, త‌మ‌కు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవ‌స‌ర‌మ‌ని తెలిపింది.