భార్య వీడియో కాన్ఫెరెన్సులో భ‌ర్త ప‌రువు పోయింది..

భార్య వీడియో కాన్ఫెరెన్సులో భ‌ర్త ప‌రువు పోయింది..

 

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోమ్’.. అంటే ఇంటి నుంచే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇది వినేందుక బాగానే ఉన్నా.. కష్టాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా బాసులతో జరిగే వీడియో కాన్ఫెరెన్స్‌ల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

 ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో నుంచి పనిచేస్తున్నా.. ఉద్యోగులు చక్కగా డ్రెస్ చేసుకోవాలని, వీడియో కాన్ఫెరెన్సులకు సిద్ధంగా ఉండాలని బాసులు చెబుతారు. అయితే, ఈ ఘటన చూసిన తర్వాత.. ఉద్యోగులే కాదు,  ముందుముందు వారి కుటుంబ సభ్యులు కూడా సరిగ్గా డ్రెస్ చేసుకోవాలని చెబుతారు అనుకుంట.

ఓ మహిళ.. వెబ్ కామ్ ద్వారా తోటి ఉద్యోగులతో వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొంది. అయితే, ఆమె భర్తకు ఈ విషయం తెలియకపోవడంతో నేరుగా ఫ్యాంట్ వేసుకోకుండా ఆ గదిలోకి వచ్చాడు. ఆమె వీడియో కాన్ఫెరెన్సులో ఉన్న సంగతి తెలియగానే కంగారుపడి గోడను గుద్దుకున్నాడు. 

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం.. ఆమె పరిస్థితి వర్ణనాతీతం అంటూూ జోకులు పేలుస్తున్నారు. #CovIdiots, #PoorJennifer హ్యాష్ ట్యాగ్‌లతో ట్రోల్ చేస్తున్నారు.