పదమూడేళ్లలో తొలిసారి డబ్బింగ్‌..!!

0
29
Amar Akbar Antony

ఇలియానా ‘దేవదాసు’ చిత్రంతో 2005లో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఈ పదమూడేళ్లలో పదిహేను తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఒక్కసారి కూడా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోలేకపోయింది. తొలిసారి ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ కోసం ఆ ప్రయత్నం చేసింది. తన పాత్రకు తానే గొంతు ఇచ్చుకుంది. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీనువైట్ల దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. ఈనెల 16న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పాత్ర డిమాండ్‌ చేయడం వల్ల ఇలియానే డబ్బింగ్‌ చెప్పుకొంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇలియానా తన డబ్బింగ్‌ పూర్తి చేసింది. ఆమె గొంతు ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంద’’న్నారు.