కరోనా కలకలం.. మైఖేల్ జాక్సన్ కు ఇదంతా ముందే తెలుసా...

కరోనా కలకలం.. మైఖేల్ జాక్సన్ కు ఇదంతా ముందే తెలుసా...

 

 ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం చెలరేగుతున్న నేపథ్యంలో పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఆయన వద్ద దాదాపు దశాబ్ద కాలం పాటు బాడీగార్డ్‌గా పనిచేసిన మాట్ ఫైడ్స్ ఇటీవల ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. 

కరోనా లాంటి ప్రమాదం గురించి మైఖేల్ పలు మార్లు హెచ్చరించారని తెలిపాడు. ఈ కారణంగానే ఆయన తరచూ మాస్క్ ధరించేవారని చెప్పారు. ‘‘ఇలాంటి ఉపద్రవం వస్తుందని ఆయనకు ముందే తెలుసు. మనవజాతి మొత్తం ఏదో రోజు తుడిచిపెట్టుకుపోతుందని, ఓ క్రిమి ప్రపంచమంతా వ్యాపిస్తుందని మైఖేల్ చెప్పేవారు’‘  అని మాట్ తెలిపాడు.

ఓ సందర్భంలో మాట్.. మైఖేల్ వద్ద మాస్క్ ప్రస్తావన తెచ్చారట‌... ‘మీరు మాస్క్ ధరించి ఉండగా ఎవరైనా ఫోటో తీసినప్పుడు అందులో నేను కూడా ఉంటే.. అది నాకు ఇబ్బందికలిగిస్తుంది. అందరూ నన్ను చూసి నవ్వుతారు’  అని మైఖేల్‌తో పరాచకమాడినట్టు తెలిపాడు. దీనికి మైఖేల్ చెప్పిన సమాధానం వింటే.. ఆయన మాస్క్‌లు, క్రిముల వ్యాప్తి విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థమైందన్నారు.

 ‘నేనూ ఈ క్రిముల బారిన పడొచ్చు. కానీ నా ఫ్యాన్స్‌ను ఇబ్బందుల్లోకి నెట్టలేను. ఈ రోజు నేనెవరిని కలుస్తానో నాకే తెలీదు. నా కారణంగా వారు వ్యాధుల బారిన పడకూడదు’  అని మైఖేల్ అన్నట్టు మాట్ చెప్పాడు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కలకలం గనక మైఖేల్ చూస్తే.. తాను ఈ ప్రమాదం గురించి ముందే హెచ్చిరించినా కూడా తనను పిచ్చివాడిగా జమకట్టారని మైఖేల్ వాపోతాడని మాట్ చెప్పుకొచ్చాడు.