ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ టైగా ముగిసింది..!!

0
170
India vs West Indies 2018

వన్డేల్లో 50 ఓవర్లలో 300 పరుగులు చేస్తే భారీ స్కోరు కిందే లెక్క. 300 పైచిలుకు విజయలక్ష్యాన్ని చాలా జట్లు అనేక సందర్భాల్లో చేధించినప్పటికీ.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు ఆ స్కోరు సాధిస్తే సగం విజయం సాధించేశామన్న ధీమాతో ఉంటాయి. భారత్‌ కూడా చాలాసార్లు 300కు పైగా స్కోరు సాధించి కొన్నిసార్లు గెలిచింది.. మరికొన్నిసార్లు ఓడింది.
అయితే టీమిండియాకు ఓ అంకె మాత్రం ఎప్పుడూ నిరాశనే మిగుల్చుతోంది. అదే 321. అవును.. వన్డేల్లో భారత్‌ ఈ స్కోరును గతంలో రెండు సార్లు చేసి పరాజయం పాలైంది. ఇక బుధవారం విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ టైగా ముగిసింది. భారీస్కోరు సాధించినా విజయం సాధించకపోవడం భారత అభిమానుల్లో నిరాశ నింపింది. దీంతో టీమిండియాకు 321 స్కోరు అచ్చిరాదని అభిమానులు అనుకుంటున్నారు.