ఒకే కార్డులో డెబిట్ కమ్ క్రెడిట్

0
231
indusind debit cum credit card

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తొలిసారి 2 ఈఎంవీ చిప్‌ డెబిట్‌ కమ్‌ క్రెడిట్‌ కార్డును ప్రవేశపెట్టింది. ఈ టూ-ఇన్‌-వన్‌ డ్యూ కార్డు రెండు మాగ్నెటిక్‌ స్ట్రిప్స్‌, 2 ఈఎంవీ చిప్స్‌లతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇవి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు చేసే రెండు పనులను చేస్తోంది. కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు డెబిట్‌ కమ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చినట్టు బ్యాంక్‌ చెప్పింది. ఇక నుంచి ఒకే కార్డును తీసుకువెళ్లవచ్చని పేర్కొంది. అనగ్రామ్‌ టెక్నిక్‌తో ఈ కార్డును బ్యాంక్‌ డిజైన్‌ చేసింది.

ఇండస్‌ఇండ్‌ డ్యూ కార్డు మొబైల్‌ కస్టమర్ల కోసం ముఖ్యంగా యువత కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌, ట్రావెల్‌, లైఫ్‌స్టయిల్‌ వంటి పలు ఫీచర్లను ముందస్తుగా అప్‌లోడ్‌ చేసుకుని వచ్చింది. బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసి, తమ కస్టమర్లకు సౌకర్యవంతంగా తీసుకురావడమే తమ లక్ష్యమని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కస్టమర్‌ బ్యాంకింగ్‌ సుమంత్‌ కత్‌పాలియా చెప్పారు. డ్యూ కార్డు లాంటి ఇన్నోవేషన్లు కస్టమర్ల జీవితాన్ని సరళీకరం చేయున్నట్టు పేర్కొన్నారు. యువత, ఔత్సాహికులైన కస్టమర్లు కొత్తదనాన్ని కోరుకుంటారని చెప్పారు.  ఒక్క ప్లాస్టిక్‌ కార్డులోనే విస్తృతమైన ఆఫర్లను, అనుభవాన్ని ఉన్నతంగా అందించనున్నట్టు పేర్కొన్నారు.