అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు రాని జగన్..!!

0
184
Jagan

వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు శుక్రవారం హాజరుకాలేదు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని జగన్ తరపు లాయర్ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. మరోవైపు ఇదే కేసు సంబంధించిన విజయసాయిరెడ్డి, సబితాఇంద్రారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి చేతిలో కత్తిపోటుకు గురైన వైఎస్ జగన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయం నేపథ్యంలో పాదయాత్రకు కూడా జగన్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.