కైఫ్ ఇప్పటికీ నీ ఫిట్ నెస్ తగ్గలా...

కైఫ్ ఇప్పటికీ నీ ఫిట్ నెస్ తగ్గలా...

 

భారత క్రికెట్ అభిమానులకి మహ్మద్ కైఫ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని ట్యాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. కళ్ళు చెదిరే అద్భుతమైన క్యాచ్ లు పట్టి ఒకప్పటి భారత క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. తన ఫీల్డింగ్ స్కిల్స్ తో అందరినీ మెప్పించాడు. ఇప్పుడు కైఫ్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందనుకుంటున్నారా..

ప్రపంచంలోని అలనాటి క్రికెటర్లందరూ కలిసి  మళ్ళీ ఓ లీగ్ స్టార్ట్ చేశారు. రోడ్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే ఈ లీగ్ ను ప్రారంభించారు. ఈ లీగ్ లో అన్ని దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లందరూ తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మహ్మద్ కైఫ్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

తొలుత టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న భారత్ టీం శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. శ్రీలంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్, కలువితరన దూకుడుగా ఆడటం ప్రారంభించారు. కొద్ది సేపటి తర్వాత మునాఫ్ పటేల్ వేసిన బంతిని దిల్షాన్ బలంగా బాదాడు. దీంతో డీప్ స్వ్కేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కైఫ్ బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టి ఆశ్చర్యపరిచాడు.

ఈ క్యాచ్ చూసిన నెటిజన్లు కైఫ్ ఇప్పటీకీ నీ ఫిట్ నెస్ తగ్గలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా 138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ టీమ్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంక లెజెండ్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ విఫలమైనా ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్ చక్కగా ఆడి టీం ను గెలిపించారు.