నా ఆస్తుల మొత్తాన్ని సీజ్‌ చేశారు : కమల్ హసన్

Kamal Hassan

రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ అన్నారు. ఆయన ‘మక్కల్‌ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో సభ్యుల జాబితాను కూడా ఆయన ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో వెల్లడించారు. కాగా, కమల్‌ తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నట్లు తెలిపారు.‘మక్కల్‌ నీది మయ్యం’ లక్ష్యం.
‘ప్రస్తుతం రాజకీయాల్లో నా పాత్రను ఎంజాయ్‌ చేస్తున్నా. నా పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యం’కు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. మేం ఇప్పటికీ వాటి కోసం సాధన చేస్తున్నాం. మాకు సలహాలు ఇచ్చే గొప్ప వ్యక్తులున్నారు’. ఓ కామెంట్‌ చేసినందుకు నాకు రాజకీయ నాయకుల నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.