ఉపఎన్నికలకు నేను రెడీ : కమల్

0
86
Kamal Hassan

విలక్షణ నటుడు, మక్కల్ నీది మయమ్ అధినేత కమల్ హాసన్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతున్నదని కమల్ స్పష్టం చేసేశారు.
అవసరమైతే తమిళనాడు శాసనసభకు 20 స్థానాల్లో జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని మక్కళ్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, సినీ హీరో కమలహాసన్ తెలిపారు. కమలహాసన్ తన 64వ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో త్వరలో రాజకీయ మార్పు ఏర్పడాలన్నదే తన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన, అవినీతి రహిత రాజకీయాలు తమిళనాట రావాలన్న ఉద్దేశ్యంతోనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు తెలిపారు. తన రాజకీయ పార్టీ మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. దినకరన్ వర్గానికి చెందిన 18 శాసనసభ్యులపై అనర్హత వేటు పడడం, మరో రెండు శాసనసభ స్థానాలు ఖాళీగా ఉండడంతో మొత్తం 20 నియోజక వర్గాలలో తమిళనాట ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అసవసరమైతే ఆ నియోజక వర్గాలకు జరిగే ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా కూడా ఉన్నట్లు కమలహాసన్ తెలిపారు.