నేటి నుంచి కమల్‌ ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో రాజకీయ పర్యటన..!!

Kamal Hassan party

నటుడు కమల్‌హాసన్‌ ,మక్కల్‌నీదిమయ్యం పార్టీ వ్యవస్థాపకుడు శుక్రవారం నుంచి రాజకీయ పర్యటన చేపట్టనున్నారు. కొత్త పార్టీ ప్రారంభించిన కమల్‌హాసన్‌ ప్రజల సమస్య లను తెలుసుకునేదిశగా తమిళనాడులో జిల్లాలవారీగా పర్యటన చేయనున్నారు. ముఖ్యంగా విద్యార్థుల వద్ద అభిప్రాయాలను సేకరించి తన రాజకీయ ప్రయాణానికి నాంది పలకనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు.