కోడిగుడ్డులో ఆకుప‌చ్చ రంగు చంద‌మామ‌.. కార‌ణం ఏంటో తెలుసా..

కోడిగుడ్డులో ఆకుప‌చ్చ రంగు చంద‌మామ‌.. కార‌ణం ఏంటో తెలుసా..

 

క‌రోనా వ‌చ్చిన‌ప్పటి నుండి ప్ర‌పంచంలో ఏ మూల ఏ వింత జ‌రిగినా.. ప్ర‌కృతి వైప‌రిత్యంగానో, దేవుడు ఆగ్ర‌హించాడ‌నో, ప్ర‌పంచం అంత‌మైపోతుంద‌నో ర‌క‌ర‌కాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.. అయితే కొత్త‌గా జ‌రిగిన వింత ఏంటి అనుకుంటున్నారా ?.. కోడిగుడ్డులో క‌న‌ప‌డిన ఆకుప‌చ్చ‌రంగు చంద‌మామ‌.. అయితే దానికి కార‌ణం ఏంటో కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు..

వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కేరళ ఆకుపచ్చ చందమామ కోడిగుడ్ల వెనుక అస‌లు క‌థేంటో తెలిసిపోయింది. ఈ గుడ్లపై కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ (కేవీఏఎస్‌యూ) నిపుణులు అధ్యయనం చేసి అసలు విషయం వెల్లడించారు. కోళ్లకు పెట్టిన ఆహారం వల్ల గానీ లేదా సహజసిద్ధమైన రంగునిచ్చే మొక్కలను తినడం వల్ల గానీ గుడ్లలోని చందమామకు ఈ రంగు వచ్చినట్టు తేల్చారు. 

మలప్పురానికి చెందిన ఓ వ్యక్తి ఈ కోడి గుడ్లను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో కేవీఏఎస్‌యూ నిపుణులు సదరు ఫౌల్ట్రీని సందర్శించి ఓ కోడిని, గుడ్లను తీసుకెళ్లి అధ్యయనం చేశారు. 

తమ అధ్యనంలో భాగంగా వాటికి పెట్టే ఆహారం మార్చగా.. రెండు వారాల్లో మళ్లీ సహజమైన పసుపు రంగు చందమామతోనే గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయని వారు తెలిపారు.