రాహుల్‌గాంధీతో భేటీ కానున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ..!!

0
228
Konda Vishweshwar Reddy

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. రాహుల్‌ను కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఆయన వివరించనున్నారు. ఈ నెల 23న మేడ్చల్‌ సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి, చేవెళ్ల లోక్‌సభ స్థానానికి కొండా విశ్వేశ్వరరెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇందుకు దారితీసిన పరిస్థితులను వివరించడంతోపాటు ప్రధానంగా ఐదు కారణాలను ప్రస్తావిస్తూ మంగళవారం సాయంత్రం మూడు పేజీల లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఆయన రాశారు. మంత్రి మహేందర్‌రెడ్డితో విభేదాలు, పార్టీలో పరిస్థితిపై ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.