లగడపాటి సర్వే లో కారుకు బ్రేకులు

0
138
lagadapati-rajagopal-survey

తెలంగాణ ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం సాయంత్రం 7 గంటలకు విడుదల చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్వే వివరాలు ప్రకటించారు. 

లగడపాటి ప్రకటించిన సర్వే ఫలితాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావొచ్చని వెల్లడించారు. లగడపాటి చెప్పిన అంకెలివే.

లగడపాటి సర్వే ఫలితాలు

[table id=2 /]

లగడపాటి సర్వే లెక్కల ప్రకారం, కాంగ్రెస్ కూటమికి ( 65 +/- 10 ) అంటే కాంగ్రెస్ కు 55 నుంచి 75 మధ్య సీట్లు వచ్చే చాన్స్ ఉంది.

ఇక టిఆర్ఎస్ పార్టీకి 25 సీట్ల నుంచి 45 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది.

https://www.youtube.com/watch?v=My0w_joIwJQ
వీడియో: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సర్వే

ఇక కూటమిలో భాగంగా టిడిపి పోటీ చేసిన 13 సీట్లలో ఆ పార్టీకి 7 సీట్లు రావొచ్చని లగడపాటి చెప్పారు. టిడిపి పోటీ చేసిన 13 సీట్లలో ఒక సీటులో ప్రత్యర్థి పార్టీ ఎంఐఎం ఉండగా మరో రెండు సీట్లలో ఇండిపెండెంట్లు ఉన్నారు. మిగతా 10 సీట్లలోనే టిఆర్ఎస్ తో ఆ పార్టీ తలపడింది. అందులో 7 సీట్లు ఖాయంగా రావొచ్చని తేల్చారు.

టీడీపీ, కాంగ్రెస్ జట్టు కట్టడంతో.. జిల్లాల్లో హస్తం పార్టీకే మొగ్గు ఉందని లగడపాటి గతంలో అభిప్రాయపడ్డారు. కానీ పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితం మారొచ్చన్నారు. పోలింగ్ శాతం పెరిగితే కూటమి గెలుస్తుందని, తగ్గితే హంగ్ రావచ్చన్నారు.