ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నాన్ ఎసెన్షియల్ డెలివరీ చేయొచ్చు

ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నాన్ ఎసెన్షియల్ డెలివరీ చేయొచ్చు

 

కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ 3.0 మొదలైంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సమయంలో, హోం మంత్రిత్వ శాఖ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మల్టీపుల్ సర్వీసులను అనుమతించింది. ఈ-కామర్స్ ప్లేయర్స్ చాలా తక్కువ లేదా కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు లేని ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే నాన్ ఎసెన్షియల్ వస్తువులను సరఫరా చేసే అవకాశం ఉంది. 


అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఆరెంజ్, గ్రీన్ జోన్లకు మాత్రమే 'Normal' డెలివరీలను తిరిగి ప్రారంభించవచ్చు. రెడ్ జోన్ల కోసం ఇ-కామర్స్ ప్లేయర్స్ అవసరమైన వాటిని మాత్రమే పంపిణీ చేయవలసి ఉంటుంది. జిల్లాలను రెడ్ జోన్లుగా వర్గీకరించడం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య, ధృవీకరణ కేసుల రేటు రెట్టింపు, జిల్లాల నుండి టెస్టులు, నిఘా ఫీడ్ బ్యాక్ పరిధిని పరిగణనలోకి తీసుకుంటుంది’ అని MHA ఒక నోటిఫికేషన్ తెలిపింది.

ఆన్‌లైన్ డెలివరీలతో పాటు, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కూడా క్యాబ్ అగ్రిగేటర్ సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించింది. టాక్సీలు, క్యాబ్ అగ్రిగేటర్లు ఒక డ్రైవర్, ఒక ప్రయాణీకుడితో మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో చాలావరకు రెడ్ జోన్‌లుగా ప్రకటించాయి.