సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత

సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత

 

టాలీవుడ్ లో ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్సిట్యూట్ ఆప్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు డాక్టర్లు కాలేయ మార్పిడి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. 

అయితే దీనికోసమే ఆయనకు బీ నెగటివ్ బ్లడ్ అవసరమైంది. దీని కోసం ఏర్పాట్లు చేసుకోమని ఆయన సన్నిహితులకు చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.. దీంతో ఆయన సన్నిహితులు కూడా దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టారు..

సుద్దాల అశోక్ తేజ వయస్సు ప్రస్తుతం 66 ఏళ్లు. తెలంగాణలోని నల్గొండ లో సుద్దాల అశోక్ తేజ జన్మించారు. తెలుగులో ఎన్నో వందల పాటలకు రచనలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో ఈయన రాసిన నేను సైతం ప్రపంచాగ్నికి అనే పాటకు నేషనల్ అవార్డ్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.