ఆ దారి పేరు వింటే వ‌ణుకే...

ఆ దారి పేరు వింటే వ‌ణుకే...

 

క‌రోనా వైర‌స్ పేరు వింటే ఎంత భ‌య‌ప‌డుతున్నారో.. అలానే ఆ రోడ్ పేరు వింటే కూడా అలానే వ‌ణికిపోతారు... ఎందుకంటే ఆ రోడ్ పేరు క‌రోనా రోడ్‌.. అంటే క‌రోనా వ‌చ్చిన వాళ్ళు ఉన్న‌ రోడ్డు అనుకునేరు... కాదు క‌రోనా కార‌ణంగా క‌ట్టిన రోడ్డు అంట‌.. 

వివ‌రాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో అర్థాంత‌రంగా ఆగిపోయిన‌ రహదారినిడ‌క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఈ లాక్ డౌన్ టైంలో నిర్మించారు. అందుకే గ్రామస్తులు ఈ రహదారికి కరోనా రోడ్ అని పేరు పెట్టారు. ఇంతేకాదు అక్క‌డ కరోనా రోడ్ అనే సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. 

అహ్మద్‌నగర్ జిల్లాలో గ‌ల‌ మాండవా గ్రామంలో ఈ రహదారిని లాక్‌డౌన్‌ సమయంలో గ్రామస్తులంతా కలిసి నిర్మించారు. అనంత‌రం ఈ ర‌హ‌దారికి క‌రోనా రోడ్ అనే పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అహ్మద్‌నగర్‌లోని మాండవ గ్రామం నుంచి లక్ష్మీవాది వరకు స‌రైన రోడ్డు మార్గంలేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ రోడ్డును నిర్మించాల‌ని గ్రామ‌స్తులంతా అనుకున్నారు.  

గ్రామానికి చెందిన కొంత‌మంది తమ భూమిని  రహదారి కోసం దానం చేశారు. ఈ నేప‌ధ్యంలో గ్రామ‌స్తులంతా చేయిచేయివేసి ర‌హ‌దారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. క‌రోనా కార‌ణంగా ఇన్ని రోజులు ఆగిపోయిన రోడ్డు మ‌ళ్ళీ నిర్మించుకున్నాం కాబ‌ట్టి ఆ రోడ్డుకు ఆ పేరు పెట్టాం అని అక్క‌డి ప్ర‌జ‌లు తెలిపారు.