ధోని ఇక మనకు టీమ్‌ఇండియా దుస్తుల్లో కనపడకపోవచ్చు..!!

0
145
Mahendra singh dhoni

మహేంద్రసింగ్ ధోని ఇక మనకు టీమ్‌ఇండియా దుస్తుల్లో కనపడకపోవచ్చు! అవును.. ధోని టీ20 ఇన్నింగ్స్‌ దాదాపుగా ముగిసినట్లే! ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ అతడికి పొట్టి క్రికెట్‌ నుంచి ఉద్వాసన పలికింది. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో జరగాల్సిన మూడేసి మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లకు ప్రకటించిన భారత జట్ల నుంచి అతణ్ని తప్పించింది. వికెట్‌కీపర్‌గా రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసింది. విండీస్‌తో మ్యాచ్‌లకు కోహ్లికి విశ్రాంతినిచ్చింది. అతడి గైర్హాజరీలో రోహిత్‌ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు కూడా సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. మురళీ విజయ్‌ తిరిగి జట్టులోకి రాగా.. హనుమ విహారి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

‘‘ఈ ఆరు టీ20ల్లో ధోని ఆడబోవట్లేదు. ఎందుకంటే మేం రెండో వికెట్‌ కీపర్‌ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌ల్లో లేనంత మాత్రాన ధోని టీ20 కెరీర్‌ ముగిసినట్లు కాదు’’ 

– ఎమ్మెస్కే ప్రసాద్‌