మ‌హేష్ “ఏఎంబీ” మ‌ల్టీప్లెక్స్ ప్రారంభం మళ్ళీ వాయిదా..!

0
175
Mahesh babu AMB Cinimas

ఏఎంబీ సినిమాస్‌ పేరుతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలో మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ నిర్మించాడు. అయితే ఈ మ‌ల్టీప్లెక్స్ ప్రారంభం మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈ మ‌ల్టీప్లెక్స్‌ని అమీర్‌ఖాన్ న‌టించిన “థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌”తోనే ప్రారంభించాల‌నుకున్నారు కానీ అప్ప‌టికీ థియేట‌ర్ పూర్తిగా రెడీ కాలేద‌ని వాయిదా వేశారు. రీసెంట్‌గా ర‌జనీకాంత్ “2.O“తో మొద‌లుపెట్టాల‌ని హంగామా చేశారు. కానీ ఇప్ప‌టికీ ప‌నులు పూర్తి కాక‌పోవ‌డంతో లాంచ్‌ని వాయిదా వేశారు. ఇది మరింత ఆలస్యం కానుందట. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ మ‌ల్టీప్లెక్స్‌ని భారీగా ప్రారంభించాల‌ని మ‌హేష్‌బాబు భావిస్తున్నాడు. ఐతే ఎప్ప‌టిక‌పుడు ఏదో ఒక స‌మ‌స్య వెంటాడుతోంది. ఈ మ‌ల్టీప్లెక్స్ ప్రారంభోత్స‌వానికి కొత్త డేట్ ఎపుడు ఫిక్స్ చేస్తార‌నేది వేచి చూడాలసిందే.