సూపర్ మార్కెట్లో వస్తువులను నాకాడు.. ఇదేం పాడుప‌ని

సూపర్ మార్కెట్లో వస్తువులను నాకాడు.. ఇదేం పాడుప‌ని

 

అమెరికాలోని పోలీసులు ఒక విడ్డూర‌మైన‌ ప్రకటనను విడుదల చేశారు.. ‘‘ఓ వ్యక్తి వాల్‌మార్ట్ స్టోర్‌లో వస్తువులను నాకుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అతడిని మేం అదుపులోకి తీసుకున్నాం. వార్రెన్ కౌంటీలో కేసు విచారణలో ఉంది. నిందితుడిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని ప్రకటించారు. 

ప్రజలు కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరంగా మారారని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. అమెరికాలోని మిస్సోరీకి చెందిన వ్యక్తి సూపర్ మార్కెట్లో సామాన్లు కొనుగోలు చేయకుండా.. అక్కడున్న వస్తువులను నాకుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది వైరల్‌గా మారడంతో అడ్డంగా బుక్కయ్యాడు.

స్నాప్‌చాట్‌లో వైరల్‌గా షేరవుతున్న ఈ వీడియో పోలీసులకు అందింది. అతడు 26 ఏళ్ల కాడీ ఫిస్టర్ అనే వ్యక్తి అని తెలుసుకున్నారు. మార్చి 11న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వారెన్టన్ పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో కాడీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మీడియాను దృష్టిలో పడేందుకే తాను ఇలా చేశానన్నాడు.

అతడిపై క్రిమినల్ కేసుకు బదులు.. తీవ్రవాద నివారణ కేసును నమోదు చేయడం గమనార్హం.