అత్తాపూర్ లో పట్టపగలు నడిరోడ్డుపై హత్య

attapur murder

రాజేంద్రనరగ్ పరిధి అత్తాపూర్‌లో బుధవారం దారుణహత్య చోటుచేసుకుంది. బస్టాండ్‌లో నిలబడిన వ్యక్తిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై నరికి చంపారు. స్థానికలు అడ్డుకునేందుకు యత్నించినా హంతకుడు ఆగకుండా నరుకుతూనే ఉన్నాడు. పోలీసులను చూసి కూడా హంతకుడు బయపడలేదు. పోలీసులు వచ్చిన తరువాత కూడా గొడ్డలితో దాడిని దుండగుడు ఆపలేదు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. మృతుడు జుమ్మేరాత్ బజార్‌కు చెందిన రమేశ్‌గా గుర్తించారు. ఆరు నెలల క్రితం మహేశ్ అనే వ్యక్తిని మృతుడు రమేశ్ హత్య చేశాడు. ఈ హత్యకేసులో భాగంగా ఉప్పర్ పల్లిలో కోర్టుకు రమేశ్ హాజరై, తిరిగి వెళ్తున్నప్పుడు దుండగులు మాటువేసి గొడ్డలి నరికి చంపారు. ఈ హత్యలో నలుగురు పాల్గొన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.