కెమెరాలే స్పెషల్ ఎట్రాక్షన్

కెమెరాలే స్పెషల్ ఎట్రాక్షన్

అమెరికా మల్టీనేషనల్ కంపెనీ మోటరోలా ఎట్టకేలకు కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే.. Moto G Stylus మోడల్. అమెరికాలో అధికారికంగా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో మెయిన్ హైలెట్‌ Stylusతో రావడమే. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ మోడల్‌కు మోటరోలా మోటో G Stylus గట్టి పోటీనిస్తోంది. దీంతో పాటు లెనోవో సొంత కంపెనీ Moto G Power స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. 

మోటో జీ స్టయిలస్ స్మార్ట్ ఫోన్లో కెమెరా డిపార్ట్ మెంట్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఫోన్ బ్యాక్ సైడ్‌లో క్వాడ్ కెమెరా సెటప్ (48MP మెయిన్ కెమెరా, మ్యాక్రో విజన్ లెన్స్, 117 డిగ్రీల అల్ట్రా వైడ్ లెన్స్, లేజర్ ఆటోఫోకస్ లెన్స్) ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఫ్రంట్ కెమెరా 16MP సెల్ఫీలకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల మ్యాక్స్ విజన్ డిస్‌ప్లే పంచ్ హోల్‌తో వచ్చింది. IPS Full HD+ డిస్‌ప్లే.. యాస్పెక్ట్ రేషియో 19:17:9తో వచ్చింది. 

ప్రాసెసర్ విషయానికి వస్తే.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, 4GB ర్యామ్ జతగా వచ్చింది. 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఉండగా, మెమెరీ కార్డు ద్వారా 512GB వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. డివైజ్ వెనుక భాగంలో 4,000mAh బ్యాటరీతో 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. రియర్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్, మైస్టిక్ ఇండిగో కలర్ ఆప్షన్ ఇతర ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. 

Moto G Power స్పెషిఫికేషన్లు ఇవే :
- 64GB ఇన్ బుల్ట్ స్టోరేజీ
- భారీ 5,000mAh బ్యాటరీ
- ట్రిపుల్ కెమెరా సెటప్ 
- 16MP, 2MP, 8MP, 16MP ఫ్రంట్ కెమెరా
- సింగిల్ స్మోక్ బ్లాక్ కలర్ ఆప్షన్ 

మోటో G పవర్, G Stylus ధర ఎంతంటే? :
మోటో G Stylus స్మార్ట్ ఫోన్ ధర 299 డాలర్లు (రూ.21,332) నిర్ణయించగా, మోటో జీ పవర్ ధర 249 డాలర్లు (రూ.17,800)గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రెండు మోడల్ స్మార్ట్ ఫోన్లు అమెరికా మార్కెట్లో లాంచ్ కాగా, అతి త్వరలో ఇండియా మార్కెట్లోకి రానుంది.