కాకినాడలో బిడ్డ, మస్కట్ లో తండ్రి.. చివరి చూపు దక్కేదెలా ?

కాకినాడలో బిడ్డ, మస్కట్ లో తండ్రి.. చివరి చూపు దక్కేదెలా ?

 

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. చైనా లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం నలుమూలల విస్తరించి భారీ ప్రాణ నష్టాన్ని సృష్టిస్తుంది. దీంతో ఈ వైరస్ కట్టడి చర్యలకు అన్ని దేశాలు నడుం కట్టాయి. మన భారతదేశం కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ను పాటిస్తుంది, ఈ లాక్ డౌన్ వల్ల దేశ విదేశాలతో రవాణా స్థంభించిపోయింది.

 ఈ వ్యాధి ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారికే ఈ వ్యాధి సోకుతుండటం తో ఈ నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో సైతం అమలు చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ లో భాగంగా విదేశాలలో వున్న మన భారతీయుల రాకపోకలు  నిలిపివేశారు. అలాగే ఇక్కడి ప్రజలు ఇండ్ల నుండి బయటకు వెళ్లకుండా చేసి కరోనా వ్యాప్తిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే భారతదేశం విధించిన ఈ లాక్ డౌన్ వలన ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తమ వారిని చూసుకోలేక అక్కడ ఉండలేక విపత్కర పరిస్థితిని ఎదురుకుంటున్నారు. దీనికి సంబంధించిన హృదయవిదారక ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ లో చోటుచేసుకొంది. ఈ రోజు  కాకినాడ లో మూడు నెలల‌ బాలుడు చనిపోయాడు. ఆ బిడ్డ తండ్రి మస్కట్ లో విధులు నిర్వర్హిస్తాడు. 

ఈ విషయం అతనికి తెలియడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. తన కొడుకును కడసారి చూసుకోవాలనే అనుకుంటున్నాడు. దానికోసం సామజిక మాధ్యమం లో ప్రధాని మోడీ కి విన్నవిస్తూ, తన కుమారుడి చివరి చూపుకు అనుమతించాలంటూ  కన్నీరు మున్నీరయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. మరీ ఈ వీడియో పై ప్రధాని స్పందించి కుమారుడి ఆఖరి చూపుకు అనుమతిస్తారో లేదో చూడాలి..