నాగార్జున మన్మధుడు సీక్వెల్

0
175
manmadhudu movie sequel
అక్కినేని నాగార్జున నటించిన సినిమా సీక్వెల్‌కి సిద్ధమవుతుంది. 2002లో రిలీజ్ అయిన మన్మథుడు సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమా సీక్వెల్ గురించి ఎప్పటి నుంచో గాసిప్స్ వినిపిస్తున్నప్పటికీ దీనిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. తాజాగా ఇది ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్వకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. నాగ్ సరసన ఈ సీక్వెల్‌లో ఎవరు నటిస్తారో వేచి చూడాలి. అన్నీ ఓకే అయితే వచ్చే ఏడాది లోగా ఈ చిత్రం సెట్స్‌పైకి రావచ్చునని సమాచారం.
ఇక 15 ఏళ్ల తరువాత ఆ సినిమాకు సంబందించిన సీక్వెల్స్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. “చి ల సౌ” సినిమాకు దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్, ఈ మన్మధుడు సీక్వెల్ కు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.