కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని పోటి?

0
154
TDP nandamuri suhasini contest from kukatpally
పార్టీ ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ, సుహాసిని అభ్యర్థిత్వం ఖరారయితే తెలంగాణలో ఎన్టీఆర్‌ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మళ్లీ ఆమే పోటీ చేసినట్లవుతుంది. సుహాసిని.. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌ సతీమణి.
‘‘ఆ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీచేస్తే బాగుంటుందని భావించాం. హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రాం లేదా కూతురు సుహాసిని పోటీపై పార్టీలో చర్చించాం. కళ్యాణ్‌రాం ఆసక్తి కనబరచలేదు. అందుకే సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాం’’ అని ఆయన వివరించారు. టీడీపీ ముఖ్యనేతలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాన్సువాడ-నిజామాబాద్‌ రూరల్‌, ఖైరతాబాద్‌-సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌-ఇబ్రహీంపట్నం స్థానాల్లో ఏవైనా మూడు టీడీపీకి దక్కనున్నాయి.