సింగిల్ సిట్టింగులో కొత్త దర్శకుడు కథకి ఒకే చెప్పిన నాని..

సింగిల్ సిట్టింగులో కొత్త దర్శకుడు కథకి ఒకే చెప్పిన నాని..

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలలో చాలా తక్కువ మందికి మాత్రమే విజయాల శాతం ఎక్కువగా ఉంటుంది. అందులో మొదటి వరసలో ఉండే యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని. అతనికి కథలపై ఉన్న జడ్జిమెంట్ అలాంటిదని అందరూ అంటుంటారు. 

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా సగం పూర్తి చేశాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా శ్యాం సింగరాయ్ అనే సినిమా ఓపెన్ చేశాడు. అది స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తి కానందువల్ల లేటయ్యే అవకాశాలు ఉన్నాయి.

దీంతో వెంటనే మరో సక్సెస్ లో ఉన్న బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ ముందుకు తీసుకొచ్చాడు. లాక్ డౌన్ అయ్యాక ఆ సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేశాడు. అయితే లేటెస్ట్ గా ఆ సినిమా కంటే ముందు స్పీడ్ గా మరో స్క్రిప్ట్ చేయాలని క్యూరియస్ గా ఉన్నాడట. 

వివరాల్లోకి వెళితే దర్శకుడు సుకుమార్ శిష్యుడు, రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు ఇటీవల నానిని కలిసి ఫుల్ స్క్రిప్ట్ చెప్పాడట. నానికి  ఆ స్క్రిప్ట్ విపరీతంగా నచ్చిందట. నిన్ను కోరి టైం లో శివ నిర్వణ చెప్పిన తీరు గుర్తొచ్చిందట. వెంటనే ఈ కథ చేయాలని డిసైడ్ అయ్యాడట. అంతేకాకుండా నిర్మాత కూడా రెడీగా ఉండి ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడంతో లాక్ డౌన్ ముగిసిన వెంటనే, ప్రభుత్వం షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని ఇమీడియట్ గా స్టార్ట్ చేసేస్తాడట. ఈ సినిమాని ఎస్ఎల్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.