నేడు ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పటేల్‌ విగ్రహావిష్కరణ

1
81
statue of unity

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. పటేల్‌ జయంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.

ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు.

1 COMMENT

Comments are closed.