నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న‌ విశాఖ ప్ర‌జ‌లు

నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న‌ విశాఖ ప్ర‌జ‌లు

హైటెక్ కల్చర్ కు విశాఖ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐటి సెక్టర్ కు తోడు భాగ్యనగరాన్ని తలదన్నేలా కంపెనీలు రావడంతో పెరుగుతున్న ఉద్యోగుల అభిరుచులకు తగ్గట్టుగా సాగరతీరంలో కొత్త తరహాలో ఫుడ్ కేంద్రాలు కొలువు దీరుతున్నాయి. ఇంటిల్లిపాది వెరైటీ ఫుడ్ రుచులను ఎంజాయ్ చేద్దామనుకునే వారికి విశాఖ నడి ఒడ్డున ఏర్పాటైన నైట్ ఫుడ్ స్ట్రీట్ ఆహ్వానం పలుకుతోంది. మిడ్ నైట్ క్రేజీ ఫుడ్ కోసం విశాఖ ప్రజలు నైట్ ఫుడ్ స్ట్రీట్ వైపు అడుగులు వేస్తున్నారు.నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న‌ విశాఖ ప్ర‌జ‌లు

 విశాఖ నగరంలో నైట్ ఫుడ్ స్ట్రీట్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ స్ట్రీట్‌లో ఫుడ్ లభ్యం అవుతుంది. పర్యటన స్వర్గధామంగా భాసిల్లుతున్న విశాఖ ప్రజలు ఇప్పుడు నైట్ లైఫ్ మజాతో ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా రాత్రి 10 గంటలు దాటితే ఫుడ్ దొరకని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటల వరకు తెరిచి ఉండే.. నైట్ ఫుడ్ బజార్‌ అందుబాటులో రావటంతో విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రభుత్వ మహిళా కళాశాలకు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో నైట్ ఫుడ్ స్ట్రీట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 30కి పైగా దుకాణాలు నిర్వహిస్తుండగా... మరో 75 దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు జీవీఎంసీ అధికారులు. ప్రస్తుతం ఉన్న నైట్ స్ట్రీట్ ఫుడ్ జీవీఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్‌లో రకరకాల ఆహారం అందుబాటులో ఉంటుంది. నగర ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి, పర్యాటకులకు వీలుగా ఉండేలా నైట్ ఫుడ్ స్ట్రీట్‌లో ఆహారాన్ని అందిస్తున్నారు.నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న‌ విశాఖ ప్ర‌జ‌లు

 నైట్ ఫుడ్ స్ట్రీట్‌లో ఇడ్లీలు, బజ్జీలు, కబాబ్‌లతోపాటు రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. విశాఖ అందాలను తిలకించడానికి వచ్చే పర్యాటకులతోపాటు పనుల మీద నగరానికి వచ్చే ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అన్నివేళల్లో ఆహారం దొరికేలా చేయడం కోసం ఈ ఫుడ్ స్ట్రీట్‌‌కు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో సెంట్రల్ పార్కు, ఎంవీపీ కాలనీ, తెన్నేటి పార్కు సమీప ప్రదేశాల్లోనూ ఇలాంటి ఫుడ్ స్ట్రీట్‌లనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

 విశాఖలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఉండే నైట్‌ ఫుడ్‌స్ట్రీట్‌ కొనసాగుతోంది. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పాత జైల్‌రోడ్డులోని ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఫుడ్‌ బజారును నగర ప్రజలతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వీలుగా ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. ఇదే స్థలంలో మరో 30 హ్యాండీక్రాఫ్ట్‌ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స చెప్పారు. నగరంలో మరో రెండు, మూడు ప్రాంతాల్లో ఇదే తరహా బజారులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సిటీ సెంట్రల్‌ పార్కులోనూ కొన్ని మార్పులు చేయడానికి ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్ రుచులను ఆస్వాధించారు.నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న‌ విశాఖ ప్ర‌జ‌లు

 హైదరాబాద్, బెంగుళూరు లాంటి సీటీల్లో నైట్ ఫుడ్ కల్చర్ ఇప్పుడు విశాఖ ప్రజలకు పరిచయమైంది. రాత్రి వేళల్లో ఫుడ్ దొరక్క ఇబ్బందులు పడే వారికి ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్స్‌ రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ స్పెషల్ గా నిలుస్తున్నాయి.