గ‌ర్ల్‌ఫ్రెండ్ తో నితిన్ పెళ్లి.. ప్రేమికుల రోజున నిశ్చితార్ధం

గ‌ర్ల్‌ఫ్రెండ్ తో నితిన్ పెళ్లి.. ప్రేమికుల రోజున నిశ్చితార్ధం

జయం సినిమాతో విజయం సాధించి తెలుగు సినిమా పరిశ్రమలో మినిమం గ్యారంటీ హీరోగా నిలబడి  ఇష్క్, గుండె జారీ గల్లంతు అయ్యిందే సినిమాతో లవర్ బాయ్ గా ఎంతో మంది అమ్మాయిల మనసు దోచుకున్న హీరో నితిన్. చాలామంది అమ్మాయిల్ని నిరాశ పరుస్తూ నితిన్ శాలిని అనే అమ్మాయి మనసు దోచుకుని ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నితిన్ కి కాబోయే భార్య శాలిని అమెరికా లో ఎంబిఎ చేసిన‌ట్టు తెలుస్తుంది. 

గ‌త 5 సంవ‌త్స‌రాలుగా ప్రేమ‌లో..

వారికి ఎప్ప‌టి నుండో ప‌రిచ‌యం ఉంద‌ని, ముందు వీరు స్నేహితులుగా ఉన్నప్ప‌టికీ.. 5 ఏళ్ళ నుండి ప్రేమ‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. భీష్మ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఒక ఇంట‌ర్వ్యూలో నితిన్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని ధృవీక‌రించాడు.
గత ఐదు సంవత్సరాలు గా ప్రేమలో ఉన్న ఇద్దరూ పెద్దల్ని ఒప్పించి సంప్రదాయబద్ధంగా కళ్యాణం చేసుకోబోతున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు ఒక్కటే కావడంతో, పెద్దలు కూడా ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదని తెలుస్తుంది, ఫిబ్రవరి14  ప్రేమికుల రోజున ఇరు కుటుంబాల పెద్దలు పసుపు కుంకాలు పెట్టుకుని సంబంధాన్ని నిశ్చయించుకుంటున్నారు.అనంతరం ఏప్రియల్  15 , 16 తారీఖుల్లో ముఖ్యమైన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మధ్య దుబాయ్ లో సంగీత్,మెహందీ ఫంక్షన్ ,  పెళ్లి జరగనున్నట్టు తెలుస్తుంది.అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్నారు..