నుబియా రెడ్ మ్యాజిక్ 5G గేమింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది

నుబియా రెడ్ మ్యాజిక్ 5G గేమింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ నుబియా నుంచి రెడ్ మ్యాజిక్ 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. స్పెయిన్‌లోని బర్సిలోనాలో ఈ ఫిబ్రవరి నెల తర్వాత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2020 ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్ కార్యక్రమంలో నుబియా ఈ 144Hz రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కొత్త స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించనుంది. ఈ విషయాన్ని నుబియా ప్రెసిడెంట్ ని ఫెయి వెయిబో మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ వేదికగా ప్రకటించారు. ఈ ఫోన్ డిజైన్ కు సంబంధించి కొన్ని పోస్టర్లను చైనీస్ సోషల్ నెట్ వర్క్‌లో ఫెయి షేర్ చేశారు. రెడ్ మ్యాజిక్ 5G త్వరలో 144Hz డిస్‌ప్లేతో పాటు స్పోర్ట్ ప్యానెల్ రీఫ్రెష్ రేటుతో ప్రపంచంలోనే ఫస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకు వస్తున్నట్టు ఆయన తెలిపారు. 

నుబియా రెడ్ మ్యాజిక్ గేమింగ్ ఫోన్లలో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ నిలువుగా మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. రెడ్ మ్యాజిక్ మానికర్, కంపెనీ లోగో కూడా ఆకట్టుకునేలా ఉంటాయని GSMArena రిపోర్టు తెలిపింది. ఇటీవలే ఫెయి.. వెయిబోలో తమ కంపెనీ అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ గురించి మరో పోస్టు షేర్ చేశారు. ఇందులో రాబోయే రెడ్ మ్యాజిక్ 5G గేమింగ్ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 80w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆకర్షణీయంగా ఉంటుందని జిజ్మో చైనా ఒక ప్రకటనలో నివేదించింది. 

రెడ్ మ్యాజిక్ 5G ఏ తేదీన ఆవిష్కరిస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. కానీ, కంపెనీ అధికారిక పోస్టర్లలో మాత్రమే ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 27 మధ్య ఫోన్ ఆవిష్కరించే తేదీలను వెల్లడించింది. రెడ్ మ్యాజిక్ 5G స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే.. కొన్ని మోడల్స్ ఇన్ఫో నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ ఫ్లాగ్ షిప్ అంటున్నారు. ఈ ఫోన్ కు సంబంధించి పూర్తి టెక్నికల్ వివరాలు ఇంకా తెలియలేదు. ఈ నెలాఖరులో కంపెనీ అధికారిక ప్రకటనలో ఫోన్ ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చు అనే విషయాలు రివీల్ చేసే అవకాశం ఉంది.