యుద్ధం లేని సమయంలో ఒలింపిక్స్ వాయిదా

యుద్ధం లేని సమయంలో ఒలింపిక్స్ వాయిదా

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు అన్ని రంగాలను దెబ్బకొట్టింది. ఇప్పటికే చాలా టోర్నీలను కరోనా దెబ్బకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు టోక్యో లో జరగనున్న ఒలింపిక్స్ ను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించేశారు. ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్లు, క్రీడా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. అయితే 2021లో జరిగినా వీటిని ఒలింపిక్స్ అనే పిలుస్తారు...


షెడ్యూల్ ప్రకారం టోక్యో గేమ్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకూ జరగాల్సి ఉంది. అయితే ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాక్, జపాన్ ప్రధాని షింజో అబె మధ్య జరిగిన చర్చల తర్వాత వీరిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటివరకూ చరిత్రలో యుద్ధం లేని సమయంలో వాయిదా పడటం ఇదే తొలిసారి. ప్రపంచ  ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది వేసవి లోపు ఒలింపిక్స్ ప్రారంభమవుతాయి..


కరోనా సోకుంతుందనే భయం కారణ:గా చాలా రోజులుగా అథ్లెట్లు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. నిజానికి చాలా దేశాల్లో స్టేడియాలను కూడా మూసేశారు. చాలా టోర్నీలు, ఒలింపిక్ క్వాలిఫయర్స్ రద్దయ్యాయి. వివిధ దేశాల్లో ఆంక్షల కారణ:గా అంతర్జాతీయ ప్రమాణాలు కూడా కష్టమవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.