టిక్‌టాక్ లైక్స్ కోసం.. పిల్లికి ఉరి వేసి చంపాడు..

టిక్‌టాక్ లైక్స్ కోసం.. పిల్లికి ఉరి వేసి చంపాడు..

 

సోష‌ల్‌ మీడియా చాలా వేగంగా పెరుగుతున్న వేళ జ‌నాల‌లో ఫేమ‌స్ అవ్వాల‌న్న కోరిక విప‌రీతంగా పెరిగిపోతుంది. అయితే చాలా సుల‌భంగా ఫేమ‌స్ అవ్వ‌డానికి ఎంచుకుంటున్న దారి టిక్‌టాక్‌.. టిక్ టాస్ వ‌చ్చాక ఫేమ‌స్ అయ్యి, సెల‌బ్రిటీలు అవుతున్న వారు చాలా మందే ఉన్నారు.. కానీ అందులో కూడా టాలెంట్ ఉండ‌టం చాలా ముఖ్యం.. అలా టాలెంట్ లేకుండా ఫేమ‌స్ అవ్వాల‌న్న కోరిక ఉన్న వాళ్ళు వారి పిచ్చి పిచ్చి చేష్ట‌లతో టిక్‌టాక్ లో ఫేమ‌స్ అవ్వాల‌నుకుంటారు. అందుకు ఎంత‌కైనా తెగిస్తారు.. అలాంటి పైశాచిక సంఘ‌ట‌నే ఒక‌టి చోటుచేసుకుంది. 

ఒక‌త‌ను ఓ పిల్లిని పట్టుకుని దూలానికి తాడుతో వేలాడ దీశాడు. టిక్‌టాక్ లో ఆ వీడియో ను రికార్డ్ చేసి.. మ్యూజిక్ యాడ్ చేసి.. అప్‌లోడ్ చేసాడు.. ఈ వీడియోకి అత‌నికి ఇంత‌కు ముందు ఎన్న‌డూ రానివిధంగా లైకులు, కామెంట్లు వ‌చ్చాయి. 

కానీ కొంత‌మంది  జంతు ప్రేమికులు, మానవత్వం ఉన్నవాళ్లు అతడిని పచ్చిబూతులు తిట్టారు. పెద్దలు చెప్పినట్లుగా.. పిల్లిని చంపడం వల్ల అతడిని మహా పాతకం చుట్టుకుంది. కొందరు అతడి వీడియోను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా చెట్టికుళానికి చెంది తంగదురైలో చోటుచేసుకుంది.

ఈ విష‌యం తెలిసిన అత‌ని స‌న్నిహితులు లైకుల కోసం ఇంత దిగ‌జారుతాడు అనుకోలేదు అన్నారు.