పద్మ పురస్కారాలు గెలుచుకున్న ఐదుగురు తెలుగువారు వీరే

Padma Awards 2020 Announced

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్దులను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ - 7, పద్మభూషణ్ - 16, పద్మశ్రీ - 118 మందికి ప్రకటించడం జరిగింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఐదుగురు తెలుగువారు ఉన్నారు. వీరిలో క్రీడా రంగంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పద్మభూషణ్ ప్రకటించారు. విద్య, సాహిత్య విభాగంలో శ్రీభాష్యం విజయసారథి, వ్యవసాయ రంగంలో చింతల వెంకటరెడ్డిలకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. కళారంగంలో ఏపీ నుంచి యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.