పాక్ షాబాజ్‌ షరీఫ్‌ అరెస్ట్

0
126
shahbaz sharif arrest

పాక్‌ మాజీ ప్రధాని, విపక్షనేత షాబాజ్‌ షరీఫ్‌ (67) అవినీతి కేసులో అరెస్టయ్యారు. రూ.1,400 కోట్ల (పాక్‌ కరెన్సీ) హౌజింగ్‌ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్‌ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం షరీఫ్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ – నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) అధ్యక్షుడిగా ఉన్నారు. ‘లాహోర్‌లోని నేషనల్‌ అకౌంటబులిటీ బ్యూరో ముందు విచారణకు షాబాజ్‌ హాజరయ్యారు. ఆషియానా హౌజింగ్‌ స్కీమ్, పంజాబ్‌ సాఫ్‌ పానీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇచ్చారంటూ ఈయనపై ఆరోపణలు వచ్చాయి.