పిల్లల కోసం పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు

Pawan Kalyan New house for kids

టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే పవన్ తన రెండో భార్య పిల్లల కోసం హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొన్నారన్నదే ఆ గ్యాసిప్. పవన్ రెండో భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం హైదరాబాద్ షిప్ట్ అయ్యారని తెలుస్తోంది.

పిల్లలు పెద్దయ్యారు.. వారి భవిష్యత్ ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత పవన్ పై వుంది. అందులో భాగంగా పిల్లలు తండ్రికి దగ్గరగా వుండాల్సిన అవసరం వుంది. అందుకే రేణు దేశాయ్ హైదరాబాద్ షిప్ట్ అయ్యారని టాక్. పవన్ కొడుకును ఎప్పటికైనా హీరోను చేయాలన్న కోరిక రేణు కు వుందని తెలుస్తోంది. ఇలా హైదరాబాద్ షిఫ్ట్ అయిన రేణు.. ఆమె కోసం పిల్లల కోసం పవన్ ఓ ఫ్లాట్ ను కొన్నారని టాక్ వినిపిస్తోంది. నటుడు మురళీమోహన్ కు చెందిన ఓ విలాసవంతమైన వెంచర్ లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ వుందని టాక్ వినిపిస్తోంది. ఎంతవరకు నిజమన్నది పవన్ కు, రేణుకు మాత్రమే తెలిసిన విషయం. ప్రస్తుతానికి వినిపిస్తున్న గ్యాసిప్ మాత్రం ఇది.