ఉదారత చాటుకున్న మెగా పవర్ స్టార్....

ఉదారత చాటుకున్న మెగా పవర్ స్టార్....

 

హీరో రాం చరణ్ ఇప్పుడు తన బాబాయ్ తో పోటీ పడుతున్నాడు. అది సినిమాలో కాదు. ఒక మంచి పని చేయడంలో.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించేశాయి. దీంతో అన్ని రంగాలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతోంది. 

సినిమా ఇండస్ట్రీతో పాటు చాలా రంగాలు దెబ్బతింటున్నాయి. దీంతో దీనిపై ఆధారపడి బతికే రోజు వారీ కూలీలకు ఉపాధి లేకుండా పోయింది.. దీంతో చాలా మంది ప్రముఖులు కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు.

ఉదారత చాటుకున్న మెగా పవర్ స్టార్....

అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల సాయం అందజేశాడు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం రూ.70 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఈ విరాళం ఇస్తానని ప్రకటించాడు. 

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బాధితులను ఆదుకునేందుకు వచ్చారు. చూడాలి కరోనా ఎఫెక్ట్ తో నష్టపోయిన వారికి ఆదుకునేందుకు ఇంకెంత మంది ముందుకొస్తారో...