బాల్కానీలో కూర్చొని హౌసీ ఆడిన కాలనీవాసులు

బాల్కానీలో కూర్చొని హౌసీ ఆడిన కాలనీవాసులు

 

‘‘మన ప్రజల సృజనాత్మకత చూసినప్పుడల్లా నాకెంతో ఆశ్చర్యం కలుగుతుందని ఆనంద్ మ‌హీంద్ర ట్వాట్ట‌ర్ లో ఒక పోస్ట్ పెడుతూ అన్నారు. పశ్చిమ ఢిల్లీలోని ఓ కాలనీవాసులంతా తమ బాల్కానీల్లో కూర్చొని హౌసీ (తంబోలా) గేమ్ ఆడారు. ప్రముఖ వాణిజ్యవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇటలీలో కొంతమంది ఒపేరా గాయకులు పాటలు పాడుతూ తమ చుట్టుపక్కల ప్రజలను సంతోష పెట్టారు. ఇది అంతకంటే గొప్ప వినోదం’’ అని ఆయన పేర్కొన్నారు. 

ఈ వీడియోలో కాలనీవాసులంతా బాల్కానీలో కుర్చున్నారు. ఓ మహిళ ఓ మైకు ద్వారా హౌసీ నెంబర్లను చదువుతుంటే.. మిగతావాళ్లు ఆడుతున్నారు. ఈ వీడియో సుమారు 2.6 లక్షల మందికి చేరింది. ఈ వీడియో చూసినవాళ్లు.. వైరస్ వల్ల నష్టం జరుగుతున్నా, మానవ సంబంధాలను మెరుగుపరుస్తోందని కామెంట్ చేస్తున్నారు. 

లాక్‌డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. రోజంతా ఏ పని లేక సతమతం అవుతున్నారు. నిత్యం బిజీ లైఫ్‌తో ముఖాలు చూసుకోని వ్యక్తులు.. ఇప్పుడిలా కలుస్తున్నారని అంటున్నారు.