ప్ర‌యాణికుడికి క‌రోనా ఉంద‌ని విమానం నుండి దూకేసిన పైలెట్‌..

 ప్ర‌యాణికుడికి క‌రోనా ఉంద‌ని విమానం నుండి దూకేసిన పైలెట్‌..

 

మహారాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి ఎయిర్ ఏసియా విమానం వచ్చింది. ఐతే... విమానంలోని మొదటి వరుసలో... కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులు ఉన్నట్లు పైలట్‌కు తెలిసింది. దాంతో అతను చాలా కంగారు పడ్డాడు. అసలే దేశంలోనే ఎక్కువగా కరోనా వైరస్ మహారాష్ట్రలోనే ఉండటంతో... ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులు ఉన్నవైపు వెళ్లకూడదని అనుకున్నాడు. 

మరైతే విమానం ఎలా దిగాలి అన్న సమస్య తలెత్తింది. ఏ లారీయో, బస్సో అయితే... సైడ్ విండో తీసి దిగవచ్చు. అది విమానం కాబట్టి... అలా దిగలేరు. ఐతే... సంస్థ ప్రతినిధులకు విషయం చెప్పిన పైలట్... తాను అందరిలా దిగబోనని చెప్పాడు. 

దాంతో... వాళ్లు ప్రత్యేక ఏర్పాటు చేశారు. విమానం కిటికీ నుంచీ దిగేందుకు సెట్ చేశారు. దాంతో పైలట్ కిటికీ లోంచీ బయటకు వచ్చాడు. హమ్మయ్య అనుకున్నాడు.

పైలట్ బయటకు వచ్చాక... తెలిసిందేంటంటే... ప్రయాణికులెవ్వరికీ కరోనా పాజిటివ్ లేదు. అయినప్పటికీ కలకలం రేగడంతో... విమానాన్ని పూర్తిగా డిజర్జంట్లతో క్లీన్ చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి ఇలా పైలట్ కిటికీ లోంచీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.