మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందుకొచ్చిన ప్లేయర్లు..

మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందుకొచ్చిన ప్లేయర్లు..

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రభావాన్ని రోజు రోజుకీ విస్తరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అయితే కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో చాలా మంది జీవనోపాధిని కోల్పోయారు. దీంతో ప్రభుత్వాలు వారిని ఆదుకునేందకు సహాయం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ సాయానికి కొందరు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ముందుకొచ్చి తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ వంతు సాయంగా ముందుకొచ్చి విరాళాలు అందజేశారు. అయితే పలువురు క్రికెటర్లు కూడా మేమున్నాం అంటూ పీఎం కేర్ కు విరాళాలు అందజేస్తున్నారు. 

క్రికెటర్లలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ తరపు నుంచి కాకుండా సొంతగా రూ.50 లక్షలు అందించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 52 లక్షలు అందజేశాడు. సురేష్ రైనా రూ.52 లక్షలు అందజేశాడు.
కరోనాపై పోరుకి క్రికెటర్లు అందిస్తున్న సాయంపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. 

అయితే ఇంకా చాలా మంది క్రికెటర్లు కూడా ముందుకొచ్చి తమ వంతు సాయం అందిస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా తమను ఇంత స్థాయిలో నిలబెట్టిన ప్రజలకు విపత్తు వచ్చిన సమయంలో వీరంతా ముందుకొచ్చి ఆదుకోవడం గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.