బెంగాల్ కు రూ.1000 కోట్లు సాయం ప్రకటించిన ప్రధాని

బెంగాల్ కు రూ.1000 కోట్లు సాయం ప్రకటించిన ప్రధాని

అంఫన్ తుఫాన్ థాటికి అల్లకల్లోలంగా మారిపోయిన బెంగాల్ ను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం బెంగాల్ కు రూ.1000 కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. అంఫన్ వల్ల జరిగిన నష్టాన్ని కేంద్రం ఒక టీంను ఏర్పాటు చేసిందని, ఈ టీమ్ సర్వే చేసి నష్టం మొత్తం వివరాలను వెల్లడిస్తుందన్నారు.తక్షణ సహాయంగా ఈ వెయ్యి కోట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు..

తుఫాన్ ప్రభావం నుంచి బెంగాల్ కోలుకుని ముందుకెళ్లాలని ప్రధాని కోరుకున్నారు. ఈ ప్రకృతి విలయంతో నష్టపోయిన బెంగాల్ ను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. నష్టపోయిన ప్రజలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు. ఈ తుఫాన్ వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.